Menu

కీర్తనలు 122

OTSA

1 “యెహోవా ఆలయానికి వెళ్దాం” అని నాతో అన్న వారితో నేను సంతోషించాను. 2 ఓ యెరూషలేమా, మీ గుమ్మాల్లో మా పాదాలు నిలిచి ఉన్నాయి. 3 యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణము; అది దగ్గరగా కుదించబడింది. 4 ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన శాసనం ప్రకారం యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వారి గోత్రాలు అనగా యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కి వెళ్తాయి. 5 అక్కడ తీర్పు కొరకైన సింహాసనాలు ఉన్నాయి, అవి దావీదు ఇంటివారి సింహాసనాలు. 6 యెరూషలేము యొక్క సమాధానం కోసం ప్రార్థించండి. “యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు క్షేమంగా ఉందురు గాక! 7 మీ ప్రాకారాలలో సమాధానం మీ కోట గోడలలో అభివృద్ధి ఉండును గాక!" 8 నా సోదరులు నా స్నేహితుల కోసం “మీలో సమాధానం ఉండును గాక” అని నేను అంటాను. 9 మన దేవుడైన యెహోవా మందిరం కోసం మీ వృద్ధిని నేను కోరతాను.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate