Menu

కీర్తనలు 121

OTSA

1 కొండల వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది? 2 ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది. 3 ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనివ్వరు, నిన్ను కాపాడేవాడు కునుకడు. 4 నిజానికి, ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు కునుకడు న్రిదపోడు. 5 యెహోవా నిన్ను కాపాడతారు, యెహోవా మీ కుడి వైపున మీకు నీడగా ఉంటారు. 6 పగటివేళ సూర్యుడు కాని లేదా, రాత్రివేళ చంద్రుడు కాని మీకు హాని చేయరు. 7 సమస్త హాని కలుగకుండా యెహోవా నిన్ను కాపాడతారు ఆయన నీ ప్రాణాన్ని కాపాడతారు. 8 ఇప్పటినుండి నిరంతరం నీ రాకపోకలలో యెహోవా నిన్ను కాపాడును.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate