Menu

కీర్తనలు 123

OTSA

1 పరలోకంలో సింహాసనాసీనుడైన దేవా, మీ వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను. 2 దాసుల కళ్లు తమ యజమాని చేతివైపు చూసినట్లు, దాసురాలి కళ్లు తన యజమానురాలి చేతివైపు చూసినట్లు, మన దేవుడైన యెహోవా మనల్ని కనికరించే వరకు మన కళ్లు ఆయన వైపు చూస్తున్నాయి. 3 మాపై దయచూపండి, యెహోవా, మాపై దయచూపండి, ఎందుకంటే మేము అంతులేని ధిక్కారాన్ని భరించాము. 4 మేము గర్విష్ఠుల అంతులేని ఎగతాళిని, అహంకారుల ధిక్కారాన్ని భరించాము.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate