Menu

కీర్తనలు 93

OTSA

1 యెహోవా పరిపాలిస్తున్నారు, ఆయన ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నారు; యెహోవా ప్రభావాన్ని వస్త్రంగా బలాన్ని ఆయుధంగా ధరించుకున్నారు; నిజానికి, ప్రపంచం దృఢంగా క్షేమంగా స్థాపించబడింది. 2 మీ సింహాసనం ఆది నుండి సుస్థిరమే. అనాది కాలం నుండి మీరున్నారు. 3 యెహోవా, నదులలో వరదలు లేచాయి, నదులు ఉరుములా గర్జిస్తున్నాయి, అలలు చెలరేగుతున్నాయి. 4 జలప్రవాహాల ఘోష కన్నా బలమైన సముద్ర తరంగాల కన్నా, యెహోవా బలాఢ్యుడై ఉన్నాడు. 5 యెహోవా, మీ శాసనాలు స్థిరమైనవి; యెహోవా మీ మందిరం అంతం లేనన్ని దినాలు పరిశుద్ధతతో అలంకరించబడుతుంది.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate