Menu

కీర్తనలు 92

OTSA

1 యెహోవాను స్తుతించడం మంచిది. మహోన్నతుడా, మీ నామాన్ని కీర్తించడం మంచిది. 2 ఉదయకాలం మీ మారని ప్రేమను రాత్రివేళ మీ నమ్మకత్వాన్ని పది తంతుల వీణ సితారా మాధుర్యంతో ప్రకటించడం మంచిది. 4 ఎందుకంటే యెహోవా, మీ కార్యముల చేత నాకు సంతోషం కలిగిస్తారు; మీ చేతులు చేసిన వాటిని బట్టి నేను ఆనంద గానం చేస్తాను. 5 యెహోవా, మీ క్రియలు ఎంత గొప్పవి, మీ ఆలోచనలు ఎంత గంభీరమైనవి! 6 దుష్టులు గడ్డిలా మొలకెత్తినా, కీడుచేసేవారంతా వర్ధిల్లుతున్నా, వారు శాశ్వతంగా నాశనమవుతారని, తెలివిలేనివారికి తెలియదు, మూర్ఖులు గ్రహించరు. 8 కాని యెహోవా, మీరు శాశ్వతంగా హెచ్చింపబడి ఉన్నారు. 9 యెహోవా, మీ శత్రువులు, నిజంగా మీ శత్రువులు నశిస్తారు; కీడుచేసేవారంతా చెదరిపోతారు. 10 మీరు నా కొమ్మును అడవి ఎద్దులా హెచ్చించారు; చక్కని నూనెలు నాపై పోయబడ్డాయి. 11 నా విరోధుల ఓటమిని నేను కళ్లారా చూశాను; నా దుష్టుల పూర్తి పరాజయాన్ని నా చెవులారా విన్నాను. 12 నీతిమంతులు తాటి చెట్లలా చిగురు పెడతారు, లెబానోనులో వారు దేవదారు చెట్టులా హుందాగా పెరుగుతారు. 13 వారు యెహోవా దేవాలయంలో నాటబడి, మన దేవుని ఆవరణాల్లో వర్థిల్లుతారు. 14 వారు వృద్ధాప్యంలో కూడా సఫలమైన జీవితంలో సారవంతంగా హాయిగా బ్రతుకుతారు, 15 “యెహోవా యథార్థవంతుడు, ఆయన నా కొండ, ఆయనయందు ఏ దుష్టత్వం లేదు” అని వారు ప్రకటిస్తూ ఉంటారు.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate