Menu

కీర్తనలు 120

OTSA

1 నా బాధలో యెహోవాకు మొరపెడతాను, ఆయన నాకు జవాబిస్తారు. 2 యెహోవా, అబద్ధమాడే పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నన్ను రక్షించండి. 3 ఓ మోసకరమైన నాలుకా, దేవుడు నీకేం చేస్తారు? ఆయన ఇంతకన్నా ఎక్కువగా నీకేం చేస్తారు? 4 వీరుల పదునైన బాణాలతో, మండుతున్న బదరీ మొక్కల నిప్పులతో ఆయన నిన్ను శిక్షిస్తారు. 5 నేను మెషెకులో నివసించినందుకు, కేదారు గుడారాల మధ్యలో జీవించినందుకు నాకు శ్రమ! 6 సమాధానాన్ని ద్వేషించేవారి మధ్యలో చాలా కాలం నివసించాను. 7 నేను సమాధానం కోరుతున్నాను; కానీ వారు యుద్ధాన్ని కోరుతున్నారు.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate