Menu

కీర్తనలు 82

OTSA

1 దేవుడు గొప్ప సభలో నిలబడి ఉన్నారు; ఆయన దైవముల మధ్య తీర్పు ఇస్తారు: 2 “మీరు ఎంతకాలం అన్యాయాలను సమర్థిస్తారు దుష్టులకు పక్షపాతం చూపిస్తారు? సెలా 3 బలహీనులు, తండ్రిలేనివారి పక్షం వహించండి; పేదలకు అణచివేయబడిన వారికి న్యాయం చేయండి. 4 బలహీనులను అవసరతలో ఉన్నవారిని కాపాడండి; దుష్టుల చేతి నుండి వారిని విడిపించండి. 5 “వారికి ఏమి తెలియదు, వారు ఏమి గ్రహించరు. వారు చీకటిలో తిరుగుతారు; భూమి పునాదులు కదిలిపోయాయి. 6 " ‘మీరు “దేవుళ్ళు”; మీరంతా మహోన్నతుని కుమారులు.’ 7 అయితే మీరు ఇతర మనుష్యుల్లా చస్తారు; ఇతర పాలకుల్లా మీరు కూలిపోతారు, అని నేనన్నాను." 8 ఓ దేవా, లేవండి, భూమికి తీర్పు తీర్చండి, ఎందుకంటే అన్ని దేశాలు మీ వారసత్వంగా ఉన్నాయి.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate