Menu

కీర్తనలు 67

OTSA

1 దేవుడు మామీద దయచూపి దీవించును గాక, ఆయన ముఖం మాపై ప్రకాశించును గాక. సెలా 2 తద్వార భూమి మీద మీ మార్గాలు దేశాలన్నిటికి మీ రక్షణ తెలుస్తాయి, 3 దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక; సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక. 4 దేశాలు సంతోషించి ఆనంద గానం చేయుదురు గాక, ఎందుకంటే మీరు జనులను న్యాయంగా పరిపాలిస్తారు భూమి మీద దేశాలను పాలిస్తారు. సెలా 5 దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక; సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక. 6 భూమి దాని పంటను ఇస్తుంది; దేవుడు, మా దేవుడు, మమ్మల్ని దీవిస్తారు. 7 అవును, దేవుడు మనల్ని దీవించును గాక, తద్వార భూదిగంతాలలో ఉన్న ప్రజలంతా ఆయనకు భయపడుదురు గాక.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate