Menu

కీర్తనలు 61

OTSA

1 ఓ దేవా! నా మనవి వినండి; నా ప్రార్థన ఆలకించండి. 2 భూదిగంతాలలో నుండి నేను మీకు మొరపెడతాను, నా హృదయం క్రుంగినప్పుడు నేను మొరపెడతాను; నాకన్నా ఎత్తైన కొండ వైపు నన్ను నడిపించండి. 3 ఎందుకంటే మీరే నాకు ఆశ్రయం, శత్రువులు చేరుకోలేని ఒక బలమైన గోపురము. 4 మీ గుడారంలో చిరకాలం నివసించాలని మీ రెక్కల చాటున ఆశ్రయం పొందాలని నేను ఆశపడుతున్నాను. సెలా 5 దేవా! మీరు, నా మ్రొక్కుబడులు విన్నారు; మీ నామానికి భయపడేవారి స్వాస్థ్యం మీరు నాకు ఇచ్చారు. 6 రాజు జీవితకాల దినాలను పొడిగించండి, అనేక తరాలకు అతని సంవత్సరాలు తరతరాలకు కొనసాగించండి. 7 అతడు శాశ్వతంగా దేవుని సన్నిధిలో సింహాసనాసీనుడై ఉంటారు; మీ మారని ప్రేమ, మీ నమ్మకత్వం అతన్ని కాపాడాలి. 8 అప్పుడు నేను ఎడతెగక మీ నామాన్ని బట్టి స్తుతి పాడతాను దినదినం నా మ్రొక్కుబడులు నెరవేరుస్తాను.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate