Menu

కీర్తనలు 128

OTSA

1 యెహోవా పట్ల భయం కలిగి, ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు. 2 మీరు మీ కష్టార్జితాన్ని తింటారు; ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది. 3 మీ ఇంట్లో మీ భార్య ఫలించే ద్రాక్షతీగెలా ఉంటుంది; మీ భోజనపు బల్లచుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారు. 4 యెహోవా పట్ల భయం కలవారు ఈ విధంగా ఆశీర్వదించబడతారు. 5 సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు; మీ జీవితకాలమంతా యెరూషలేము అభివృద్ధిని చూస్తారు. 6 మీరు మీ పిల్లల పిల్లల్ని చూస్తారు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate