Menu

కీర్తనలు 127

OTSA

1 యెహోవా ఇల్లు కడితేనే తప్ప దానిని కట్టే వారి శ్రమ అంతా వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కావలి ఉండకపోతే దాన్ని కాపలా కాసేవారు నిలబడి కాయడం వ్యర్థమే. 2 మీరు ప్రొద్దున్నే లేచి ఆలస్యంగా పడుకొంటూ, కష్టపడి పని చేస్తూ ఆహారం తినడం వ్యర్థమే. ఆయన ప్రేమించేవారు నిద్రిస్తునప్పుడు కూడా యెహోవా సమకూరుస్తారు. 3 పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. 4 యవ్వనకాలంలో పుట్టిన పిల్లలు వీరుని చేతిలో బాణాలవంటివారు. 5 వారితో తన అంబులపొదిని నింపుకున్నవాడు ధన్యుడు. గుమ్మంలో తమ విరోధులను ఎదుర్కొన్నప్పుడు వారు అవమానం పొందరు.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate