Menu

యోబు 25

OTSA

1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబిచ్చాడు: 2 “అధికారం భీకరత్వం దేవునివే; ఉన్నత స్థలాల్లో సమాధానాన్ని కలుగజేస్తారు. 3 ఆయన సైన్యాలు లెక్కించబడగలవా? ఎవరి మీద ఆయన వెలుగు ఉదయించదు? 4 అలాంటప్పుడు దేవుని ఎదుట ఎలా నీతిమంతుడు కాగలడు? అలాంటప్పుడు స్త్రీకి పుట్టిన ఒకడు ఎలా పవిత్రుడు కాగలడు? 5 ఒకవేళ దేవుని దృష్టిలో చంద్రుడు కాంతివంతుడు కానప్పుడు; నక్షత్రాలు పవిత్రమైనవి కానప్పుడు. 6 పురుగువంటి మనుష్యుడు క్రిమివంటి మనుష్యుడు ఆయన దృష్టిలో పవిత్రుడు కాలేడు కదా!"

Everything we make is available for free because of a generous community of supporters.

Donate