Menu

కీర్తనలు 131

IRV

1 యెహోవా, నా హృదయంలో అహంకారం లేదు. నా కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించడం లేదు. నాకు మించిన విషయాల జోలికి నేను వెళ్ళడం లేదు. 2 తల్లిపాలు విడిచిన పిల్ల తన తల్లి దగ్గర నిశ్చింతగా ఉన్నట్టు నేను ప్రశాంతంగా ఉండి నాప్రాణాన్ని స్థిమితంగా ఉంచుకున్నాను. 3 ఇశ్రాయేలు ప్రజలారా, ఇప్పటి నుండి ఎప్పటికీ యెహోవా పైనే ఆశ పెట్టుకోండి.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate